
నెహ్రూ జూలాజికల్ పార్కును సినీ నటుడు నాగబాబు మంగళవారం మధ్యాహ్నం సందర్శించారు. జూపార్కులోని ఆయా వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌ను సందర్శించి వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. జూపార్కు సందర్శన ఎంతో అనుభూతిని అందిస్తుందన్నారు. జూ నిర్వాహణ, వన్యప్రాణుల సంరక్షణ, క్లీన్ అండ్ గ్రీన్ చాలా చక్కగా నిర్వహిస్తున్నారని జూ మేనేజ్‌మెంట్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఒక జత సెనెగల్ రామచిలుకలను కొనుగోలు చేయాలంటూ రూ.35 వేల చెక్కును తన సోదరి విజయ తరఫున జూపార్కు క్యూరేటర్ వి.వి.ఎల్.సుభద్రాదేవికి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment