మెగా బ్రదర్ నాగబాబు కొణిదెల చేతికి గాయమైంది. నాగబాబు తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన తాజా వీడియోలో ఆయన చేతికి కట్టు వేసుకుని కనిపించారు. దీంతో ఆయన చేయి ఫ్యాక్షర్ అయినట్లు తెలుస్తోంది. ఈ వీడియోకు ‘ముల్లును ముల్లుతోనే తియాలంటే ఇదేనేమో.. అయితే ఇది ఎవరూ ఇంట్లో ట్రై చేయకండి. నిపుణురాలు డా.నీహారిక పర్యవేక్షణలో జరిగింది’ అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు ఆయన. ఈ వీడియోలో తండ్రితో పక్కనే కూర్చుని ఉన్న నిహారిక సైలెంట్‌గా అల్లరి చేస్తోంది. తండ్రి గడ్డాన్ని నిమురుతూ ‘నొప్పిగా ఉందా నాన్న.. ఆ నొప్పి నేను తీసేయనా’ అంటుండగా.. పెద్ద పెద్ద డాకర్ట్స్ వల్లే కాలేదు.. నీ వల్ల ఏమౌతుంది అంటాడు నాగాబాబు.
చదవండి: కొడుకు చంద్రహాస్‌పై ట్రోల్స్.. నటుడు ప్రభాకర్ షాకింగ్ రియాక్షన్
‘నేను తీసేస్తా అంటున్నా కదా.. ఆ నొప్పి తీసేస్తా’ అంటూ నిహారిక తండ్రి చేయి పట్టుకుని గట్టిగా కొరికింది. ఆ నొప్పి భరించలేక నాగబాబు ఒక్కసారిగా గట్టిగా ఆరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ తండ్రి కూతుళ్ల బాండింగ్‌కు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే నాగబాబు చేతికి ఏమైంది? ఆ గాయం ఎలా అయ్యిందనేది క్లారిటీ లేదు. దీంతో ఆయనకు ఏమైందా? అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. హీరోయిన్ గురించి ఏమన్నదంటే..
Comments
Please login to add a commentAdd a comment