సాక్షి, అమరావతి: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పేరుతో జనసేన పార్టీ మీడియా విభాగం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జనసేనలో ఉండే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలే.
ఈ మధ్యకాలంలో కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందినవారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నందున.. మరోసారి ఈ విషయాన్ని మీకు విశదీకరిస్తున్నాను’ అని పేర్కొన్నారు. జనసేన అభిప్రాయాలను, నిర్ణయాలను పార్టీ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నామని, వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని పేర్కొన్నారు.
నాగబాబు అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు
Published Sun, May 24 2020 5:29 AM | Last Updated on Sun, May 24 2020 5:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment