నాగబాబుగారికి ధన్యవాదాలు : అంబటి | Ambati Rambabu Strong Counter to Nagababu | Sakshi
Sakshi News home page

నాగబాబుగారికి ధన్యవాదాలు : అంబటి రాంబాబు

Published Sat, Jan 18 2020 4:27 PM | Last Updated on Sat, Jan 18 2020 6:15 PM

Ambati Rambabu Strong Counter to Nagababu - Sakshi

సాక్షి, అమరావతి : సినీ నటుడు, జనసేన నేత నాగబాబు వ్యాఖ్యలపై వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. నాగబాబు వ్యాఖ్యలపై ట్విటర్‌ వేదికగా అంబటి కౌంటర్‌ ఇచ్చారు. ‘నేను ‘తోకలేని పిట్ట’ చిత్రంలో నటించిన సంగతి నేనే మరచితిని.. గుర్తుంచుకున్నందుకు నాగబాబుగారికి ధన్యవాదాలు నటనలో ఓటమిపాలై నిష్క్రమించాను నేను.. రాజకీయాలలో ఓటమిపాలైన మీరు నిష్క్రమిస్తారా.... లేక’ అంటూ నాగబాబుపై వ్యంగ్య ధోరణిలో మండిపడ్డారు. నాగబాబు ట్వీటర్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పైవిధంగా స్పందించారు.  ‘బహు పాత్రలలో బాగు బాగు’  అని పేర్కొంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై కూడా అంబటి రాంబాబు ట్వీట్‌ చేశారు.

చదవండి:

హోదావదిలేశా సాంబా!

పవన్ కల్యాణ్కు నేరుగా 10 ప్రశ్నలు

పవన్ కల్యాణ్ అలా చేసి ఉండాల్సింది

పార్ట్నర్స్ వేసిన మరో ప్లాన్..!

నేనేమైనా వాళ్లకు బాకీ ఉన్నానా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement