
హన్మకొండ చౌరస్తా: ఐఎంఎఫ్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని సినీ నటుడు కొణిదెల నాగబాబు సూచించారు. విదేశీ విద్య కన్సల్టెన్సీ ప్రారంభోత్సవానికి ఆదివారం ఆయన నగరానికి వచ్చారు. హన్మకొండ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐఎంఎఫ్‌ఎస్ శాఖను ప్రారంభించిన అనంతరం నాగబాబు విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అన్ని సదుపాయాలు వరంగల్‌లోనే ఉన్నాయన్నారు.
ప్రపంచంలోని అనేక దేశాల్లోని ఉత్తమ విశ్వవిద్యాలయాలతో ఐఎంఎఫ్‌ఎస్‌కు భాగస్వామ్యం ఉందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కార్యక్రమంలో సంస్థ సీఈఓ కేపీ సింగ్, టెక్స్›టైల్ హ్యాండీక్రాఫ్ట్ ఓఎస్‌డీ శాంత, సంస్థ ప్రతినిధి అజయ్, కార్పొరేటర్ విజయ్‌భాస్కర్, హైకోర్టు న్యాయవాది పట్టాభి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ఆచార్య@ మారేడుపల్లి.. చిరు గ్రాండ్ ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment