సాక్షి, కాకినాడ: ఏపీలో ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో భారీగా పంట నష్టం జరిగింది. ఇక, కూటమి ప్రభుత్వం నిర్లక్క్ష్యం కారణంగా విజయవాడ జల దిగ్బంధమైంది. కాగా, వర్షాల నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ ప్రజలను, రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఏదో అరకొరగా సాయం అందించి ఏపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. కాకినాడ రైతులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మండిపడుతున్నారు.
తాజాగా చంద్రబాబు ప్రకటించిన వరద నష్టపరిహారంపై పిఠాపురం నియోజకవర్గంలోని యూ.కొత్తపల్లి మండలంలో రమణక్కపేటకు చెందిన రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..‘ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహరం ఎందుకూ పనికి రాదు. ఎకరాకు రూ.30 వేలు ఇస్తేనే రైతు ఆర్ధికంగా గట్టెక్కగలడు. ఏలేరు వరదతో సర్వం కోల్పోయాం. ఐదు రోజులుగా నీట మునిగిన పంట ఎందుకు పనికి రాదు. ఇప్పటికే నీటిలో మునిగిన పంట కుళ్ళిపోయి వరద నీటిలో పైకి తేలుతుంది.
ఎకరాకు రూ.10వేలు ఇస్తానని చంద్రబాబు చేసిన ప్రకటనపై మాకు నమ్మకం లేదు. గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నష్టపోయిన రైతులకు పరిహరం అందించాడా?. డిప్యూటీ సీఎం, మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇంత వరకు నష్టపోయిన రైతులను పలకరించ లేదు. ఎన్నికల సమయంలో ఏ చిన్న కష్టం వచ్చినా మీకు నేను ఉన్నాను అంటూ లేనిపోని హామీలు ఇచ్చాడు. ఇప్పుడు కనీసం మావైపు కూడా చూడటం లేదు. ఇదేనా మామీద పవన్‌కు ఉన్న బాధ్యత. ఆయనను నమ్మి గెలిపించుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు పర్యటనకు జనసేన ఎమ్మెల్యేలు డుమ్మా
మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆయన పిఠాపురంలో ఉన్నాడో.. హైదరాబాద్‌లో ఉంటున్నాడో మాకు తెలియదు. ఓట్లు వేయించుకున్న ఎంపీ ఉదయ్ ఎక్కడ ఉన్నారు. మా బాధలు ఎందుకు పట్టించుకోరు. ఎన్నికల సమయంలో పిఠాపురానికి వచ్చి జబర్ధస్ ఆర్టిస్టులు వచ్చి ఏదోదో చెప్పారు. పిఠాపురాన్ని మలేషియా చేస్తాం. అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు. మాకు ఇంత నష్టం జరిగినా కనీసం ఏ ఒక్కరూ వచ్చి పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే కౌలు రైతుకు ఆత్మహత్యే శరణ్యం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓట్లు కోసం వచ్చారు కానీ కష్టంలో ఉంటే ఎవరూ కనబడడం లేదు!!
పవన్ కళ్యాణ్ ,ఎంపీ ఉదయ పై పిఠాపురం రైతులు ఫైర్. pic.twitter.com/5eFox9Drjn— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) September 11, 2024
Comments
Please login to add a commentAdd a comment