
ఎగసి పడుతున్న అలలు.. కోతకు గురవుతున్న తీరం
కొత్తపల్లి : రెమాల్ తుపాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద కడలి కల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరం కోతకు గురవుతోంది.
కెరటాల తాకిడికి యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, కోనపాపపేట గ్రామాల్లో పదుల సంఖ్యలో ఇళ్లు కడలిలో కలిసిపోతుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అలల తాకిడికి జియోట్యూబ్ రక్షణ గోడ రాళ్లు సైతం గ్రామంలోకి వచ్చి పడ్డాయి. ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురైంది.