సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలోనూ రైతులు గతేడాది కంటే అధిక దిగుబడి సాధించారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఏపీ ప్రజా నిర్వాహక ప్రకృతి వ్యవసాయంపై బ్లూమ్ అధ్యయనం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కన్నబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా కలిగే ఆరోగ్య లాభాలపై అధ్యాయనం చేసేందుకు, రాష్ట్ర ప్రభుత్వ రైతు సాధికార సంస్థ, ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయం, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఎంవోయూ తీసుకున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు మరింత ఆదాయం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృఢ నిశ్చయంతో ఉన్నారని, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో దిగుబడి పెంచేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment