గల్ఫ్‌ దేశాలకు ‘అనంత’ అరటి ఎగుమతి | Kurasala Kannababu Inaugurates Banana Export Program In Anantapur | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ దేశాలకు ‘అనంత’ అరటి ఎగుమతి

Published Thu, Jan 30 2020 5:26 PM | Last Updated on Thu, Jan 30 2020 5:55 PM

Kurasala Kannababu Inaugurates Banana Export Program In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: నిత్యం కరవు కాటకాలతో తల్లడిల్లే అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని  చేపట్టింది. జిల్లాలో శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండలం కడవకల్లులో అరబ్ దేశాలకు అరటి ఎగుమతి చేసే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం గురువారం శ్రీకారం చుట్టింది. ఈ ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటెయినర్ల ద్వారా విదేశాలకు అరటి సరఫరాను దేశంలోనే మొట్టమొదటి సారిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. (అరబ్‌ దేశాలకు ‘అనంత’ అరటి)

దీని వల్ల పండ్ల తోటల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది యాభై వేల టన్నుల అరటి ఎగుమతి చేస్తామని ఆయన వెల్లడించారు. అన్ని రకాల పండ్లకు దీన్ని విస్తరిస్తామని కన్నబాబు పేర్కొన్నారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మట్లాడుతూ..  కరవు జిల్లా అయిన అనంతపురంలో ఈ  కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పండ్ల తోటల రైతులంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పద్మావతి పిలునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement