
సాక్షి, విజయవాడ : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ప్రతిపక్షనాయకుడు చంద్రబాబుకు పవన్ వకీల్ సాబ్‌లా పనిచేస్తున్నాడని దుయ్యబట్టారు. 2014 నుంచి చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ పని చేస్తున్నాడని విమర్శించారు. నాలుగు సార్లు గెలిచిన కొడాలినానిని విమర్శించే అర్హత పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఒకే రోజు పవన్, లోకేష్ జిల్లాలో పర్యటించడం వెనుక అంతర్యం తెలియదా అని నిలదీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో ఎన్నడూలేని విధంగా నెల రోజుల్లోనే పరిహారం అందిస్తున్నారని, చంద్రబాబు పాలనలో ఏనాడైనా పరిహారం త్వరగా ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ ఎందుకు అడగలేదని, ఎకరానికి రూ. 6 వేలు నిర్ణయించింది చంద్రబాబు పాలనలో కాదా అని సూటిగా అడిగారు.
Comments
Please login to add a commentAdd a comment