సాక్షి, కాకినాడ: రైతు సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల ఆనందం చూడలేక టీడీపీ నేతలకు కడుపుమంట అని మండిపడ్డారు.
క్రాప్ హాలీడే అంటూ.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడ క్రాప్ హాలీడే ప్రకటించారో ఆధారాలు చూపించాలని అన్నారు. విద్యుత్ మీటర్ల వల్ల ఒక్క రైతుకైనా రూపాయి భారం పడిందా? అని ప్రశ్నించారు. మీటర్లపై రైతులకు లేని అభ్యంతరం టీడీపీ నేతలకు ఎందుకని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment