
సాక్షి, కృష్ణా: వరదల వల్ల నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి, జిల్లా ఇంచార్జి కురసాల కన్నబాబు హామీ ఇచ్చారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. మంత్రి మాట్లాడుతూ అధికారులు పంటనష్టంపై అంచనాలు రూపొందిస్తున్నారని, రైతులందరికీ నష్ట పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. రైతులకు అండగా ఉండాలన్నదే సీఎం జగన్ మోహన్‌రెడ్డి ధ్యేయమన్నారు. రైతులకు వంద శాతం సబ్సిడీపై విత్తనాలు ఇస్తామన్నారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు.. కృత్రిమ వరదను సృష్టించారనడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. రైతుల బాధలు వినకుండా తన ఇంటిని ముంచారనడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, కొలుసు పార్థసారథి, కొక్కిలిగడ్డ రక్షణనిధి, వ్యవసాయ కమిషనర్ అరుణ్ కుమార్ వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment