సాక్షి, విశాఖపట్నం : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం ఏడాదిలోనే అభివృద్ధి చెందిందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఏడాదిలోనే విత్తన శుద్ధి కేంద్రాలు పూర్తి చేస్తామని తెలిపారు. చెరుకు రైతులకు 55 కోట్ల బకాయిలు ముఖ్యమంత్రి చెల్లించారన్నారు. మంత్రి గురువారం మాట్లాడుతూ.. చెక్కర కర్మాగారాలు అభివృద్ధి చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెరకు రైతులకు ఆదుకున్నారన్నారు. (‘నాడు – నేడు’పై మన కల నిజం కావాలి)
చోడవరం చెరకు ఫ్యాక్టరీ కోసం ఇప్పటి వరకు ఏడాది కాలంలో 96 కోట్లు నిధులు మంజూరు చేశారని మంత్రి తెలిపారు. చోడవరం షుగర్స్‌లో 140 కోట్ల పంచదార నిల్వ ఉంచగా వెంటనే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. చక్కెర కర్మాగారాలు ఆధునీకరణకు అగష్టు నెల గడువులోగా కమిటీ వేస్తామన్నారు. ప్రతి జిల్లాలో సీడ్ ప్రోసెసింగ్ యూనిట్‌లు, ప్రతి నియోజకవర్గంలో మినీ ప్రోసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి కన్నబాబు వెల్లడించారు. (ఏపీలో కొత్తగా 1555 పాజిటివ్ కేసులు)
Comments
Please login to add a commentAdd a comment