సాక్షి, తూర్పుగోదావరి : క్యాన్సర్ రహిత భారత దేశాన్ని దూపొందించుకోవాల్సిన అవసరం ఉందని పద్మశ్రీ పురస్కార గ్రహీత, హస్యనటుడు బ్రహ్మనందం తెలిపారు. పిబ్రవరి 4 (మంగళవారం) ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ గురించి అందరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పొగాకు మన సంస్కృతి కాదని, విదేశీయులకు ఉన్న పొగతాగే అలవాటును మనం నేర్చుకున్నామని తెలిపారు. ఈ మధ్య కాలంలో విదేశీ ప్రభావం ఎక్కువ అవడం వల్ల వారి అలవాట్లు బాగా నేర్చుకున్నామన్నారు.
మంచి ఆరోగ్యం ఒక వరమని.. అలాంటి వరాన్ని అందరూ పొందాలని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో గుండె, క్యాన్సర్ రోగాలు ఎక్కువగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చారని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఉచిత వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment