సాక్షి, విజయవాడ: టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తాను ఇచ్చే స్టేట్‌మెంట్ల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. తప్పులు చేసిన టీడీపీ ఇప్పుడు తమ మీద ఆరోపణలు చేయడానికి సిగ్గుపడాలి అని మండిపడ్డారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ, ‘ కాకినాడ సెజ్‌ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొట్టాయాలని చూస్తున్నారంటూ యనమల చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నారు. అసలు సెజ్‌లు తీసుకొచ్చింది ఎవరు టీడీపీ కాదా? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెజ్ భూములు వెనక్కి ఇస్తాం అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎందుకు ఇవ్వలేదు? ప్రజలను గ్రాఫిక్స్ లో ఉంచకుండా వాస్తవంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుంటే చంద్రబాబు ఎందుకు భయం. భోగపురంలో గత ప్రభుత్వం ఇచ్చిన 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంది. ఈ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను కేవలం పారిశ్రామిక వేత్తలుగానే చూస్తుంది.
మ్యాట్రిక్ ప్రసాద్ గతంలో చంద్రబాబుతో వ్యాపారం చేస్తే ఆయన మంచోడు అదే జగన్ ప్రభుత్వంతో వ్యాపార సంబంధాలు ఉంటే మాత్రం చెడ్డ పారిశ్రామిక వేత్తా? గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సమయంలో సెజ్‌కి వచ్చారు. సెజ్ విషయంలో ఉన్న సమస్యల కోసం ఒక కమిటీ వేసి ఆ కమిటీకి నన్ను అధ్యక్షుడుగా పెట్టారు. యనమల ఒకసారి తాను చేస్తున్న వ్యాఖ్యల గురించి ఆలోచించుకోవాలి. హెటిరో అనే ఫార్మా సంస్థ ఏర్పాటు కోసం అక్కడ ప్రజల పైన కేసులు పెట్టలేదా ? గతంలో దివిస్ పరిశ్రమ వచ్చినప్పుడు ఒక భారీ బహిరంగ సభ పెట్టి గొప్పగా చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిశ్రమ పెడితే తప్పు అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో సెజ్ విషయంలో పెట్టిన కేసులతో ఇప్పటికీ అక్కడ రైతులు బాధపడుతున్నారు.
గతంలో సమ్మిట్ ల పేరుతో కోట్లాది రూపాయల ఖర్చుచేశారు కానీ, కోటి రూపాయల పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయారు. రెండు కమిటీల మధ్య జరిగిన ఒప్పందాన్ని ముఖ్యమంత్రికి అంటగడుతున్నారు. మచిలీపట్నం పోర్ట్ విషయంలో కేసులు వేసింది టీడీపీ నాయకులు కాదా? అమరావతిలో 5 సంవత్సరాల్లో ఒక బిల్డింగ్ కూడా కట్టలేక ప్రజలకు గ్రాఫిక్స్ చూపించారు. మీ పార్టీ పారిశ్రామిక వేత్తలను అధికారం పోయాక చంద్రబాబు ఎక్కడ జాయిన్ చేశారో అందరికి తెలుసు.
గత 5 సంవత్సరాల్లో సెజ్ భూములను వెనక్కి ఇస్తా అంటే ఎవరు అడుకున్నారు?, పరిశ్రమలు పెడతామంటే ఎవరు వద్దు అన్నారు, ఓడ రేవులు కడతామంటే ఎవరు ఆపారు?. అమరావతి రైతుల నోట్లో చంద్రబాబు మట్టి కొట్టారు. 5 సంవత్సరాల్లో భూములు ఇచ్చిన రైతులకు ఎందుకు ప్లాట్లు వేసి ఇవ్వలేకపోయారు. దేశంలో 82 కార్పొరేషన్లు అమ్మేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే గతంలో చంద్రబాబు 52 అమ్మేశారు. కాకినాడ నడిబొడ్డులో ఉన్న గోదావరి ఫెర్టిలిజర్స్ ఫ్యాక్టరీని చంద్రబాబు అమ్మేశారు. యనమల ఒకసారి గతాన్ని చూసుకుంటే వారి చరిత్ర తెలుస్తుంది. గతంలో టీడీపీ చేసిన అప్పులను తీర్చడానికే ఈ ప్రభుత్వం కష్టపడాల్సి వస్తుంది. పరిశ్రమలకు భూములిచ్చిన రైతులకు మా ప్రభుత్వం పూర్తిగా న్యాయం చేస్తుంది’ అని పేర్కొన్నారు.
‘ఆ వ్యాఖ్యల గురించి యనమల ఆలోచించుకోవాలి’
Published Thu, Oct 1 2020 7:47 PM | Last Updated on Thu, Oct 1 2020 7:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment