
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబాస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ఇక మీదట రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి సన్నబియ్యం సేకరించాలని జగన్ ఆదేశించారన్నారు. ఈ మేరకు చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
భూసమస్యల పరిష్కారానికి కమిటీ : పిల్లి సుభాష్‌చంద్రబోస్
గత ప్రభుత్వం భూముల వ్యవహారం ఆన్‌లైన్ చేయడం వల్ల అనేక అవకతవకలు జరిగాయని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఫలితంగా రైతుల భూమి హక్కుకు భంగం కల్గిందని.. భద్రత లేదని విమర్శించారు. భూసమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి రిటైర్డ్ జడ్జి, అనుభవజ్ఞులైన రిటైర్డ్ సర్వేయర్, రెవెన్యూ అధికారులతో ఒక కమిటీ నియమించాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారన్నారు. ఇది ఒక ఆహ్లదకరమైన.. ఆహ్వానించదగిన నిర్ణయమని కొనియాడారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి భూ సర్వే జరిగి దాదాపు 111 సంవత్సరాలు అవుతుందన్నారు. రీసర్వేను జగన్ ఒక చాలెంజ్‌గా తీసుకున్నారని.. దీనిపై అనుభవజ్ఞులైన అధికారులతో సమీక్షిస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment