కాకినాడ: కరోనా వైరస్ నివారణకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న చర్యలను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ప్రభుత్వానికి మంచి పేరు రావడం చూసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నుంచి అయ‍్యన్న పాత్రుడి వరకూ నోటికీ ఏదొస్తే అది మాట్లాడుతున్నారన్నారు. సీఎం జగన్ చేసే మంచి పనులతో టీడీపీ నేతలకు కడుపు రగిలిపోతుందన్నారు. లాక్‌డౌన్ విధించిన పరిస్థితుల్లో వ్యవసాయం, వ్యవసాయేతర అనుబంధాల రంగాల పట్ల ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు ఓ చారిత్రకమన్నారు.(‘చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకో’)
‘ఇది అంతా టీడీపీ నేతల కడుపు మంట. సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలతో టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. చంద్రబాబులా మాది మాటల గారడీ, పబ్లిసిటీ ప్రభుత్వం కాదు. ధాన్యం నుండి ఉద్యానవన పంటల వరకూ మద్దతు ధర ఇచ్చి మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. చంద్రబాబు, లోకేస్, రాజప్ప, అయ్యన్న పాత్రుడిలా మేము ఇంట్లో పడుకుని ప్రకటనలు ఇవ్వడం లేదు. ప్రాణాలకు తెగించి కరోనా నివారణకు రోడ్లపై తిరుగుతున్నాం. వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది మా ముఖ్యమంత్రి జగనే. రైతు రుణమాఫీ సరిగ్గా చేయలేని చరిత్ర మీది.గత టీడీపీ ఐదేళ్ల పాలనలో రైతులను గాలికొదిలేసి, ఇవాళ అదే రైతుల కోసం చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు మాట్లాడతారా?, ఆక్వాకు మొట్టమొదటి సారిగా మేము మద్దతు ధర ఇచ్చిన విషయాన్ని మీరు అంగీకరిస్తారా?, మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి.. సవరించుకోండి’అని టీడీపీ నేతల తీరుపై కురసాల ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment