సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండవ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ రంగంపై చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. టీడీపీ ఐదేళ్లలో చేసిన బీమా కన్నా రెట్టింపు బీమ చేయించామని తెలిపారు. రైతు విత్తనం వేసిన దగ్గర్నుంచే బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ఈ ప్రక్రియలో 71లక్షల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
గత టీడీపీ ప్రభుత్వం ఏనాడు రైతులకు పూర్తి సబ్సిడీ ఇవ్వలేదని గుర్తు చేస్తూ, రైతుల కోసం టీడీపీ నేతలు ఏనాడైనా ఒక్క సలహానైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. అసలు రైతులు గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని ధ్వజమెత్తారు. హోం మంత్రి అమిత్ షా తిరుపతికి వస్తే రాళ్లు వేయించిన చంద్రబాబు, ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆయన కాళ్లు పట్టుకున్నాడు.. అసలు చంద్రబాబు గురించి మాట్లాడితే ఏడాది పాటు సభ పెట్టినా సరిపోదని విమర్శించారు. మంగళగిరిలో లోకేష్ ఓటమిని తట్టుకున్న గుండె చంద్రబాబుది, కుప్పంలోనూ ఓటమి ఆయనకు లెక్కకాదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని మంత్రి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment