
సాక్షి, కాకినాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు ఫైర్ అయ్యారు. ఓడిపోతామనే భయంతో టీడీపీ నేతలు వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీకి ఇవే చివరి ఎన్నికలు అని చంద్రబాబు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. డబ్బున్న వాళ్లకే వైఎస్ జగన్ సీట్లు ఇస్తున్నారని చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘టీడీపీలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, గల్లా జయదేవ్, నారాయణలు తేల్లరేషన్ కార్డులు ఉన్న నిరుపేదలా? వాళ్లు ఏమైన రేషన్ బియ్యం తింటూ బతుకుతున్నారా? చంద్రబాబు ఏమైనా నిరుపేదలను రాజకీయ నాయకులుగా తీర్చుదిద్దుతున్నారా? సీఎం తీరు వినేవాడుంటే చెప్పవాడు చంద్రబాబు అన్నట్లుగా ఉంది’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఇలాగే మాట్లాడి టీడీపీకి పుట్టగతులు లేకుండా చేసుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్‌కు దొంగ బుద్దులు నేర్పించారన్నారు. టీడీపీకి, చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని జోస్యం చేప్పారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధిస్తుందని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. (చినబాబు సీటు.. పెద్ద తలనొప్పే)
Comments
Please login to add a commentAdd a comment