గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లోని ఒప్పందాలకు వాస్తవ రూపం
కాకినాడలో రూ.12,500 కోట్ల పెట్టుబడులపై తుది నిర్ణయం తీసుకున్న గ్రీన్‌కో సంస్థ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలిస్తోంది. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భాగంగా చేసుకున్న ఒప్పందాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఇందులో భాగంగానే కాకినాడ జిల్లాలో ఏఎం గ్రీన్ (గ్రీన్‌కో గ్రూప్ సంస్థ) రూ.12,500 కోట్ల పెట్టుబడులపై తుది నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాదికి మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ కార్యకలాపాలు 2026లో ప్రారంభం కానున్నాయి.
ఇందుకోసం 1,300 మెగావాట్ల కార్బన్ రహిత విద్యుత్, 4,500 మెగావాట్ల సోలార్, 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్ట్, ఇతర వనరులను కంపెనీ సమకూర్చుకుంది. అదేవిధంగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే అమ్మోనియాను యూరప్‌కు ఎగుమతి చేయనున్నారు. ఇందుకోసం యారా క్లీన్, కెప్పెల్, యూనిపర్ వంటి ప్రధాన సంస్థలతో ఏఎం గ్రీన్ సంస్థ ఒప్పందాలు సైతం ఇప్పటికే కుదుర్చుకుంది. మరోవైపు ఏడాదికి 5 మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యాన్ని 2030 నాటికి ఛేదించేలా దేశవ్యాప్తంగా ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించేందుకు గ్రీన్‌కో సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment