సాక్షి, కాకినాడ : మినరల్ స్పిరిట్ పేరుతో డీజిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న భారీ రాకెట్‌ను డీఆర్ఐ అధికారులు గుట్టు రట్టు చేశారు. ఈ అక్రమ దందా దుబాయ్ నుంచి కొనసాగిస్తున్నారు. కాకినాడ, చెన్నై కేంద్రంగా డీజిల్ అక్రమ దందా సాగుతున్నట్లు సమాచారం. దాదాపుగా 12 ప్రాంతాల్లో డీఆర్‌ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నకిలీ కంపెనీలు, తప్పుడు డాక్యుమెంట్లతో డీజిల్ అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.
40 శాతం ధర తక్కువ చూపించి కస్టమ్స్ డ్యూటీ పన్ను ఎగవేస్తున్నారు. రూ. 17.7 కోట్ల విలువైన 285 కంటైనర్తు దిగుమతి అయినట్లు అధికారులు గుర్తించారు. రంగంలోకి దిగిన డీఆర్ఐ బృందం నలుగురిని అరెస్టు చేసింది. అంతేకాక హవాల ఆపరేటర్‌ను కూడా అరెస్టు చేశారు. కోటి విలువైన 14 కంటైనర్ల డీజిల్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment