![A Man Arrested In Cheating Case In Kakinada - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/2/cheating.jpg.webp?itok=NHRZ5FRr)
సాక్షి, కాకినాడ : ఆన్‌లైన్‌లో సొమ్మును బదిలీ చేస్తానని చెప్పి బంగారం అపహరించిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితుడిని పట్టుకున్నారు. వివరాలు.. మొదట్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేసేవాడనీ, తరువాత విలాసాలకు అలవాటు పడిన వ్యక్తి చోరీలకు కూడా పాల్పడ్డాడని, ఈ క్రమంలోనే బంగారు దుకాణంలో గోల్డ్ బిస్కెట్లను కూడా అపహరించాడని పోలీసులు తెలిపారు. అతడి వద్ద రూ. 26లక్షల విలువైన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment