యాదగిరిగుట్ట : శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉద్యోగాలు నిర్వర్తించి విరమణ పొందిన వారందరికీ ప్రభుత్వం హెల్త్‌కార్డులు ఇవ్వాలని ఆ సంఘం అధ్యక్షుడు కె.శేషాచార్యులు కోరారు. పట్టణంలో గురువారం రిటైర్డ్ ఉద్యోగ సంఘం 18వ పెన్షనర్స్‌డే సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేవస్థాన ఫించన్‌దారులకు ఇంక్రుమెంట్లు కల్పించాలన్నారు. అంతే కాకుండా స్థానికంగా ఉన్న దేవస్థానం రిటైర్డ్ ఉద్యోగులకు వైటీడీఏ ద్వారా ని«ధులు కేటాయించి భవనం ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం 75 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న విశ్రాంత ఉద్యోగులకు అమృతోత్సవ సన్మానం చేశారు. అలాగే సమావేశానికి వచ్చిన పెన్షనర్లకు భోజన ఏర్పాటు చేసిన రాములు, జయమ్మకు సన్మానం చేశారు. సమావేశంలో కలకుంట్ల బాలనర్సయ్యగౌడ్, కోల ఆంజనేయులుగౌడ్, శ్రీనివాసరావు, యాదగిరిచారి, నాగభూషణం, నర్సింహ, డి.యాదగిరిరెడ్డి, నరేశ్, స్వామి పాల్గొన్నారు.