కుటుంబసమేతంగా యాదాద్రికి కేసీఆర్‌ | KCR visit to Yadagirigutta temple along with his family | Sakshi
Sakshi News home page

కుటుంబసమేతంగా యాదాద్రికి కేసీఆర్‌

Published Fri, Nov 24 2017 12:39 PM | Last Updated on Fri, Nov 24 2017 1:09 PM

KCR visit to Yadagirigutta temple along with his family

సాక్షి, యాదాద్రి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సమేతంగా శుక్రవారం యాదాద్రి సందర్శించారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితుల ఆశీర్వచనం పొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌వీ నాయకుడు తుంగ బాలు వివాహానికి సీఎం హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

సుమారు రూ.800 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలనతో పాటు రెండోదశ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ప్రధానాలయం, పెద్దగుట్ట టెంపుల్‌ సిటీ పనులను కేసీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులపై అధికారులతో కేసీఆర్‌ చర్చించారు.  సీఎం వెంట రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికార యంత్రాంగం, వైటీడీఏతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా సీఎం కేసీఆర్‌ ఈ రోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదగిరిగుట్ట చేరుకున్నారు. ఆయనకు ఈ సందర్భంగా మంత్రులు జగదీశ్ రెడ్డి, ఐకే రెడ్డి, విప్ సునీత, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement