Published
Sun, Jul 24 2016 8:48 PM
| Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
ఉచిత సేవలు అభినందనీయం...
యాదగిరిగుట్ట: పేద ప్రజలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉచిత వైద్యం చేస్తున్న ఆర్‌కే ఆస్పత్రి సేవలు అభినందనీయమని యాదగిరిగుట్ట జెడ్పీటీసీ కర్రె కమలమ్మ అన్నారు. మండలంలోని బాహుపేటలో ఆదివారం భువనగిరికి చెందిన ఆర్‌కే ఆస్పత్రి నిర్వాహకులు పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ కమలమ్మ సర్పంచ్ ఇమ్మడి మాధవితో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పల్లె ప్రాంతాల్లోని పేదలకు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇలాంటి ఆస్పత్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందించాలన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో 300పైగా మంది రోగులు వివిధ వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు ఆస్పత్రి అధినేత డాక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అరుణ ఆంజనేయులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుండె నర్సయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్ కౌడే మహేందర్, ఉపసర్పంచ్ చాంద్‌పాషా, చెవి, ముక్కు, గొంతు నిపుణులు విద్యాసాగర్, ఆండ్రియాలజిస్టు సురేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.