రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ యాదాద్రికి వస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. ఆదివారం ఉదయం 11.10 గంటలకు వడాయిగూడెం హెలిప్యాడ్‌లో రాష్ర్టపతి దిగుతారు. 11.50కి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఉదయం 10 గంటలకు గుట్టకు చేరుకుంటారు. సీఎం హెలికాప్టర్ కోసం మరో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు,ఉన్నతాధికారులు రాష్ర్టపతికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటారు. రాష్ట్రపతి వచ్చే వరకు సీఎం వేచి ఉండడానికి ప్రత్యేకంగా వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ రాష్ర్టపతి వచ్చే వరకు సీఎం వేచి ఉంటారు. రాష్ట్రపతి హెలికాప్టర్‌లో ప్రయాణించే మార్గంలో ముందుగా గంటవరకు మరే హెలికాప్టర్‌ను అనుమతించరు. అందుకే సీఎం గంట ముందే యాదాద్రికి చేరుకోనున్నారు.
Published Sun, Jul 5 2015 6:20 AM | Last Updated on Wed, Mar 20 2024 3:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement