
యాదాద్రి భువనగిరి : 2019లో కాదు కదా 2030లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాదని టీఆర్‍ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‍రెడ్డి జోస్యం చెప్పారు. యాదగిరిగుట్టలో విలేకరులతో మాట్లాడుతూ..వంగపల్లి సభలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మార్ రెడ్డి ప్రగల్భాలు పలికాడని విమర్శించారు. ఎవరిని మభ్యపెట్టడానికి సీఎం కేసీఆర్ పై వాఖ్యలు చేశారని ప్రశ్నించారు.
అవినీతికి నిలువుట్టద్దం బిక్షమయ్యగౌడ్ అని ఆరోపించారు. బిక్షమయ్య ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి తీన్మార్ మల్లన్న విమర్శలు చేస్తున్నాడని చెప్పారు. నిజంగా బిక్షమయ్య నీతిపరుడే అయితే ఎందుకు ముందస్తు బెయిల్‌తో తిరుగుతున్నాడని సూటిగా అడిగారు.
Comments
Please login to add a commentAdd a comment