మోటకొండూరు మండలం గ్రామస్థుల ఆందోళన | Motakonduru villagers Protest | Sakshi
Sakshi News home page

మోటకొండూరు మండలం గ్రామస్థుల ఆందోళన

Published Tue, Sep 27 2016 2:15 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Motakonduru villagers Protest

నల్గొండ జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేయనున్న మోటకొండూరు మండలంలో తమ గ్రామాలను కలపాలని కోరుతూ పలు గ్రామాలకు చెందిన ప్రజలు మంగళవారం ఉదయం రాస్తారోకో చేశారు. మహబూబ్‌పేట, చెల్లేరు, చిన్నకందుకూరు, చీమలకొండూరు, ముత్యాలపల్లి తదితర గ్రామాలను మోటకొండూరు మండలంలో కలపాలని వారు డిమాండ్ చేశారు. మండల కేంద్రానికి ఈ గ్రామాలు దగ్గరగా ఉన్నందున పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని వారు చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వారు మంగళవారం ఉదయం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement