యాదగిరిగుట్ట: విజయవాడలో నిర్మాణాల పేరుతో హిందూదేవాలయాల కూల్చివేయడాన్ని నిరసిస్తూ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ తీశారు. పీఠాధిపతులు, పూజారుల సలహాలు, సూచనలు పాటించకుండా దేవాలయాలను కూల్చడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని సమితి రాష్ట్ర కార్యదర్శి కట్టెగొమ్ముల రవీందర్ రెడ్డి అన్నారు. కూల్చివేసిన విగ్రహాలను మళ్లీ ప్రతిష్టించి మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.