నీటి కోసం మహిళల నిరసన | women protest for water in nalgonda district | Sakshi
Sakshi News home page

నీటి కోసం మహిళల నిరసన

Published Fri, Apr 29 2016 9:27 AM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM

women protest for water in nalgonda district

యాదగిరిగుట్ట: తమ కాలనీలో నీటి సమస్యపై ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవటం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పంచాయతీలోని బీసీ కాలనీ మహిళలు శుక్రవారం ఉదయమే పంచాయతీ కార్యాలయం వద్దకు తరలివచ్చారు. దాదాపు 25 మంది మహిళలు బిందెలతో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. నీటి కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులెవరూ ఇంకా అక్కడికి చేరుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement