
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో క్యూలైన్లు, గర్భాలయం, కొండపై పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. రద్దీ దృష్ట్యా కొండపైకి భారీ వాహనాలను అనుమతించలేదు. సుమారు 40 వేల మంది స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు.
దర్శనానికి 4 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండపై పనులు జరిగే ప్రాంతాల నుంచి విష్ణు పుష్కరిణిలోకి పెద్ద ఎత్తున మట్టి కొట్టుకు వచ్చింది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment