
బాల ఆలయానికి తరలిన లక్ష్మీనృసింహుడు
యాదగిరికొండ(నల్లగొండ): యాదిగిరి లక్ష్మీ నృసింహుడు బాలాలయానికి తరలివెళ్లాడు. ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులను చేపట్టిన నేపథ్యంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బాల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన చేపట్టారు. ఈ కార్యక్రమం గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు త్రిదండి చిన్న జీయర్‌స్వామి నేతృత్వంలో సాగింది. ఇకపై బాలాలయం నుంచే స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. స్వయంభు నరసింహుడితో పాటు కవచమూర్తులు, ఆండాళ్ అమ్మవారు, ఆళ్లార్ల, క్షేత్రపాలకుల విగ్రహాలను ఒక్కొక్కటిగా బాలాలయంలోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, విప్ సునీత, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.