సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు
సాక్షి, కూకట్‌పల్లి(హైదరాబాద్): కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో గురువారం ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఇద్దరు ఉద్యోగులు పట్టు బడ్డారు. కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో రెవెన్యూ డిపార్టుమెంట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న చాంద్ పాషా ఆస్‌బెస్టాస్ కాలనీకి చెందిన నాగరాజుకు సంబంధించిన మ్యుటేషన్ చేయకుండా గత రెండు నెలలుగా జాప్యం చేస్తున్నాడు. ఇటీవల డబ్బులు డిమాండ్ చేయగా గురువారం రూ.8 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చాంద్ పాషా పనిచేసే కార్యాలయంతో పాటు ఇంటి వద్ద కూడా దాడులు నిర్వహించిన అధికారులకు రూ. లక్షల్లో నగదు దొరికినట్లు తెలిపారు.
మరో కేసులో..
ఆస్‌బెస్టాస్ కాలనీకి చెందిన నాగరాజు ట్రేడ్ లైసెన్స్ పేరు మార్పిడి విషయంలోనూ శానిటేషన్ విభాగానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ షణ్ముఖ్ డబ్బులు డిమాండ్ చేయగా గురువారం రూ. 2,500 తీసుకుంటూ పట్టు బడ్డాడు. గత కొద్ది రోజులుగా నాగరాజు జీహెచ్‌ఎంసీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా షణ్ముఖ్ పేరు మార్పిడి విషయంలో నాగరాజును ఇబ్బంది పెట్టి డబ్బులు డిమాండ్ చేయటంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ దాడుల్లో డీఎస్పీలు ఫయాజ్, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు రేణుక, రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment