దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో నిందితులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్లను ఎన్ఐఏ అధికారులు ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి తరలించారు. దిల్సుఖ్నగర్ బాంబ్ కేసులో విచారణ నిమిత్తం ఆ ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అధికారులు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ తీసుకువచ్చారు.
ఇటీవల దేశ సరిహద్దుల వద్ద యూసిన్ భత్కల్తోపాటు మరోకరిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దేశంలోని వివిధ బాంబు పేలుళ్లలో భత్కల్ కీలక పాత్ర పోషించాడని నిఘా వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.