కోర్టులో భత్కల్ హల్చల్ | bhatkal halchal at court | Sakshi
Sakshi News home page

కోర్టులో భత్కల్ హల్చల్

Published Mon, Jul 6 2015 1:33 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM

కోర్టులో భత్కల్ హల్చల్

కోర్టులో భత్కల్ హల్చల్

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో హల్చల్ సృష్టించాడు. కేసు విచారణ నిమిత్తం పోలీసులు అతడ్ని కోర్టులో హజరుపర్చారు. కోర్టు హాలులోకి ప్రవేశించిన వెంటనే ఒక్కసారిగా జేబులో నుంచి ఓ కాగితాన్ని తీసిన భత్కల్..  కోర్టు కిటికీ నుంచి దానిని బయటకు విసిరేశాడు.

ఈ అనూహ్య చర్యకు బిత్తరపోయిన పోలీసులు ఒక్క ఉదుటన భత్కల్ను అదుపుచేసే ప్రయత్నం చేశారు. కిటికీ నుంచి అతడు విసిరేసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, అందుకే పారిపోతున్నానని ప్రచారం చేస్తున్నారని, ఎన్కౌంటర్లో చంపేస్తారేమోనని అనుమానం ఉదని భత్కల్ ఆ లేఖలో పేర్కొన్నాడు. మరోవైపు భత్కల్ తల్లి రహీనా కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement