దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు..వాదనలు పూర్తి
హైదరాబాద్ : దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో వాదనలు ముగిశాయి. ఈనెల 21న నిందితులకు శిక్షలను ఖరారు చేస్తూ చర్లపల్లిలోని ఎన్‌ఐఏ కోర్టు తీర్పు ఇవ్వనున్నది. 2013 సంవత్సరం ఫిబ్రవరి 21న జరిపిన పేలుళ్లలో 22మంది మృతి చెందగా 138మంది గాయపడిన విషయం విదితమే. ఈ కేసులో అసదుల్లా అక్తర్, యాసిన్ భత్కల్, తహ సిన్ అక్తర్, జియావుర్ రెహ్మాన్ (పాక్), ఎజాజ్ షేక్‌లను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.
వీరిపై చర్లపల్లిలోని ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. 157మంది సాక్షులను కోర్టు విచారించగా 502 డాక్యుమెంట్లను ఎన్‌ఐఏ సేకరించింది. కాగా పాకిస్థాన్‌లో తలదాచుకున్న నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ సూత్రధారిగా, బంగ్లాదేశ్ కేంద్రంగా పని చేసిన ఐఎం ఆపరేషనల్ చీఫ్ యాసిన్ భత్కల్ పేలుళ్లకు పాల్పడిన విషయం తెలిసిందే.
Dilsukh nagar Blasts, NIA court, hearing, verdict, Yasin Bhatkal, దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు, వాదనలుపూర్తి, ఎన్ఐఏ, యాసిన్ భత్కల్