‘2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్ జంటబాంబు పేలుళ్ల ఘటనకు కారణమై, 17 మంది చావుకు, అనేక మంది జీవితాలను చీకట్ల పాలు చేసిన ఉగ్రవాది యాసిన్ భత్కల్‌తో పాటు...
‘2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్ జంటబాంబు పేలుళ్ల ఘటనకు కారణమై, 17 మంది చావుకు, అనేక మంది జీవితాలను చీకట్ల పాలు చేసిన ఉగ్రవాది యాసిన్ భత్కల్‌తో పాటు అతనికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలి. ప్రస్తుతం మేము పడుతున్న బాధలు భవిష్యత్‌లో మరెవ్వరూ పడకూడదంటే వాడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి’... అని ఘటనలో కాళ్లు, చేతులు, కళ్లు కోల్పోయిన క్షతగాత్రులు స్పష్టం చేశారు. మారణహోమం జరిగి ఆరు నెలల ఎనిమిది రోజులైంది. ఇప్పటికైనా అతన్ని అరెస్ట్ చేయడం హర్షనీయం. అయితే కేసులు, కోర్టులు, విచారణల పేరుతో జాప్యం చేయకుండా వెంటనే భత్కల్‌ను శిక్షించాలి. అతనికి విధించే శిక్ష తీవ్రవాదులకు ఓ హెచ్చరిక కావాలని బాధితులు పేర్కొన్నారు.
ఎన్‌కౌంటర్ చేయాలి
విచారణ పేరుతో జాప్యం చేయకుండా భత్కల్‌ను వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి. నరకమంటే ఎలా ఉంటుందో వాడికీ చూపించాలి. చేయని తప్పుకు నేను కాలు, చెయ్యి, కన్ను కోల్పోయాను. గా యా లు ఇంకా మానలేదు. ఆరు మాసాలుగా నరకం అనుభవిస్తున్నా. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇంకా పూర్తి సాయం చేయలేదు. వైద్యం ఖర్చులను ఇవ్వడంలేదు. ఇప్పటికే నా సొంత డబ్బు రూ. 2 లక్షలకు పైగా ఖర్చు చేశా. కంటి ఆపరేషన్‌కు మరో రూ. లక్షకుపైగా ఖర్చు అవుతుంది.
- పాండురంగారెడ్డి, గట్లమల్లెపల్లి, నల్లగొండ జిల్లా
ఉగ్రవాదులకు హెచ్చరిక కావాలి
ఉగ్రవాదుల కుట్రకు నేను బలైపోయాను. పేలుళ్లలో కుడి కాలు కో ల్పోయాను. ఎంబీఏ పూర్తి చేసి, తల్లిదండ్రులకు ఆసరాగే ఉండాల్సిన నన్ను వారికి భారంగా మార్చారు. నన్ను ఈ దుస్థితికి తెచ్చిన ఉగ్రవాదులను వదలొద్దు. జైల్లోనే నరకం చూపించాలి. భత్కల్‌కు విధించే శిక్ష ఉగ్రవాదులకు హెచ్చరిక కావాలి. గాయం మానడంతో ఇటీవలే కృత్రిమ కాలు అమర్చుకున్నా.
- రజిత, బికనూర్, నిజామాబాద్
వందసార్లు ఉరి తీసినా తక్కువే...
భత్కల్ మనిషి రూపం లో ఉన్న మృగం. ఇ లాం టి వాళ్లను వదలొ ద్దు. పేలుళ్లలో ఎంతో మంది చనిపోయారు. నాతో పాటు 130 మంది తీవ్రం గా గాయపడ్డారు. ఇంకా చాలా మంది కోలుకోలేదు. ఈ ఘటనలో గాయపడటం వల్ల నేను ఉద్యోగం కోల్పోయాను. భత్కల్‌లాంటి మా నవ మృగాళ్లను వందసార్లు ఉరితీసినా త క్కువే.
- స్వాతిరెడ్డి , బీఎన్‌రెడ్డినగర్
నరరూపరాక్షసుడిని ఉరి తీయాలి
అమాయకుల ప్రాణాలు తీసి వా రి కుటుంబాలను చిన్నాభిన్నం చేసి న నరరూపరాక్షసుడు యాసిన్ భత్కల్‌ను ఉరి తీయాలి. దేశంలో ఉగ్రవాదం అనే మాట వినిపించకుండా కేంద్ర ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేయాలి. ముష్కరుల ఘాతుకానికి ఎంతో మంది జీవచ్ఛవాల్లా బతుకులీడుస్తున్నారు. ఉన్నత చదువులు చదవాలన్న నా కలలను చిదిమేసిన ఇలాంటి దుండగులను ఏం చేసినా పాపంలేదు.
- బొంగు శ్రావణి, బాధితురాలు, సైదాబాద్
నరహంతకుల్ని మాకు అప్పగించాలి
అమయాకుల ప్రాణాల్ని బలి తీసుకున్న నరహంతకులను ప్రభుత్వం జైల్లో ఉంచి రాచమర్యాదలతో బిర్యానీలు పెట్టకూడదు. బాంబుపేలుళ్ల ఘటనలో గాయపడి నరకాన్ని అనుభవిస్తున్న క్షతగాత్రులకు వారిని అప్పగించాలి. భత్కల్, అతని అనుచరులను నాకు అప్పగిస్తే ఒక్కొక్క అవయావాన్ని తొలగించి చిత్రహింసల పాలుజేసి చావంటే ఏలా ఉంటుందో చూపించాలని ఉంది. ఘటన జరిగిన నాటి నుంచి కాలు, చేయి చచ్చుపడి నడవలేని పరిస్థితుల్లో జీవచ్ఛవంలా బతకుతున్నా. ఆనాటి నుంచి నేటి వరకు కంటి నిండా నిద్రపోయింది లేదు. ఉన్నదంతా వైద్యానికే ఖర్చు అయిపోయింది. ఇంటి పెద్ద దిక్కును మంచానికే పరిమితమయ్యా. ఆదుకునే వారు.. పరామర్శించేవారు లేరు. ఏం పాపం చేశామని మాకు ఈశిక్ష.
- పి.యాదయ్య, బాలాజీనగర్ ఐఎస్‌సదన్
ఉగ్రవాదులను బహిరంగంగా శిక్షించాలి
జంట బాంబు పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను బహిరంగా ఉరితీయాలి. పేలుళ్ల చనిపోయిన వారు, గాయపడిన వారిలో ఎక్కువ మంది పేదలే. క్షతగాత్రులు అంగవైకల్యంతో నానా కష్టాలుపడుతున్నారు. ప్రభుత్వం తీవ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేయాలి. భత్కల్, ఇతర ఉగ్రవాదులను జైల్లో పెట్టి వారికి కోట్ల రూపాయలు ఖర్చు చేసేకన్నా నిర్థాక్షిణ్యంగా చంపేయాలి. దేవుని దయ వల్ల పేలుడు ఘటన నుంచి బతికి బయటపడ్డా.
- ఆశంగారి బక్కారెడ్డి, ఏ-1, మిర్చి సెంటర్, దిల్‌సుఖ్‌నగర్
బాధితుల కళ్లెదుటే ఉరితీయాలి...
బౌద్దనగర్: దిల్‌సుఖ్‌నగర్ జంటపేలుళ్ల నింది తు డు భత్కల్‌ను పోలీసులు గురువారం అరెస్టు చే యడంపై మృతుల కుటుంబ సభ్యులు హర్షం వ్య క్తం చేశాయి. బౌద్దనగర్‌కు చెందిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగి రాములు బాంబుపేలుళ్లలో మృతి చెం దిన విషయం విదితమే. భత్కల్ అరెస్టు గురించి తెలిసి అతని భార్య అండాలు, కుమారుడు సుధాకర్ ఆనందం వ్యక్తం చేశారు. అమాయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులను బాధిత కు టుంబాల ఎదుటే ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు.