చెన్నైలోనూ భత్కల్ రెక్కీ
Published Sun, Sep 1 2013 1:44 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
సాక్షి, చెన్నై: యూసిన్ భత్కల్ రెండు రోజుల క్రితం పట్టుబడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు కస్టడీలో ఉన్న భత్కల్ తన ఉగ్ర చర్యల్ని ఒక్కొక్కటిగా చెబుతున్నాడు. పత్రికల్లో, మీడియాలో భత్కల్ ఫొటోలు వచ్చాయి. వీటి ఆధారంగా ఇతను గతంలో చెన్నైలో తిష్ట వేసిన విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో సెలయూరులో బీహారి విద్యార్థుల ముసుగులో సాగుతున్న సిమీ కార్యకలాపాల్ని కేంద్ర నిఘా సంస్థ బట్టబయ లు చేసింది. కేంద్ర పోలీసు బృందం దాడికి ముందుగా అక్కడి నుంచి కొందరు యువకులు ఉడాయించినట్లు వార్తలు వెలువడ్డాయి. వీరిలో భత్కల్ ఉన్నట్లు తాజాగా తేలింది. ప్రధాన ప్రాంతాల్లో ఉన్న నిఘా నేత్రాల్లో గతంలో నమోదైన దృశ్యాలతో భత్కల్ నగరంలో పలుచోట్ల రెక్కీ నిర్వహించినట్లు తేలింది.
రిచ్ స్ట్రీట్‌లో..
రిచ్ స్ట్రీట్‌లోని కెమెరాల్లో గతంలో నమోదైన దృశ్యాల ఆధారంగానే కేంద్ర బృందం సెలయూరులో దాడులు చేసినట్లు తేలింది. ఆ వీధిలో భత్కల్ పలుమార్లు సంచరిం చినట్లు గుర్తించారు. ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్ విడి భాగాలు కొనుగోలు చేసినట్లు తేలింది. నగరంలో తిష్ట వేసిన సందర్భంలో భత్కల్ వలలో ఎవరైనా యువకులు పడ్డారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. భత్కల్ చెన్నై నుంచి పాకిస్తాన్ ఐఎస్‌ఐ తీవ్రవాదులతో సంప్రదింపులు జరిపినట్లు ఆధారాలు బయటపడ్డారుు. దీంతో ఇక్కడ ఏదేని కుట్రకు వ్యూహ రచన చేశాడా అనే ఆందోళన నెలకొంది
Advertisement
Advertisement