: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఐఎస్ఐ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ను మంగళవారం చర్లపల్లి జైలు నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టుకు తరలించారు.
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఐఎస్ఐ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ను మంగళవారం రంగారెడ్డి జిల్లా కోర్టుకు తరలించారు. విచారణలో భాగంగా భత్కల్ ను పటిష్టమైన భద్రత మధ్య చర్లపల్లి జైలు నుంచి కోర్టుకు తీసుకువచ్చారు.
ఇండియన్ ముజాయిద్దీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌ను జైలు నుంచి తప్పించేందుకు ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) పెద్ద కుట్ర చేస్తున్నట్లు ఇటీవల ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చర్లపల్లి జైలు నుంచి భత్కల్‌తో పాటు మిగతా ఉగ్రవాదులను తప్పించేందుకు స్లీపర్ సెల్స్ ప్రణాళికలు రచిస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాల ద్వారా జైలు సమాచారం చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.