చర్లపల్లి జైలు వద్ద హై అలర్ట్ | security titen at charlapalli prision | Sakshi
Sakshi News home page

చర్లపల్లి జైలు వద్ద హై అలర్ట్

Published Fri, Jul 17 2015 11:23 PM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

చర్లపల్లి జైలు వద్ద హై అలర్ట్

చర్లపల్లి జైలు వద్ద హై అలర్ట్

హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగారం వద్ద శుక్రవారం రాత్రి హైడ్రామా నెలకొంది. జైలు ఆవరణ చుట్టూ పోలీస్ విభాగమైన ఆక్టోపస్ బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించారు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల నిందితుడు, ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడైన యాసిన్ భత్కల్ జైలు నుంచి పారిపోయే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.

కొద్దిరోజుల కిందట జైలు నుంచి తన తల్లి, భార్యతో ఫోన్లో మాట్లాడిన భత్కల్.. జైలు నుంచి బయటికి వస్తానని చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన వార్తలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇటు రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. భత్కల తప్పించుకుంటాడనే వార్తలను జైళ్ల శాఖ అధికారులు మొదట కొట్టిపారేసినప్పటికీ తర్వాత ఆ అవకాశం లేకపోలేదని పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement