octopus forces
-
BHEL కంపెనీ దగ్గర ఉద్రిక్త వాతావరణం.. ఆక్టోపస్ దళాల హంగామాతో ప్రజల్లో భయం
-
ఇక ఆక్టోపస్ బృందం పర్యవేక్షణలో శ్రీవారి ఆలయం
తిరుమల: తిరుమల ఆలయం వద్ద పటిష్ట భద్రత కోసం ఆక్టోపస్ బృందాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి తెలిపారు. ఆలయం వద్ద భద్రత ఏర్పాట్లను బుధవారం తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆక్టోపస్ అధికారులతో కలిసి డీఐజీ పరిశీలించారు. అనంతరం డీఐజీ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయ ప్రవేశమార్గం వద్ద ఏర్పాటుచేసే ఈ చాంబర్లో ఐదు నుంచి ఆరుగురు సభ్యుల ఆక్టోపస్ బృందం.. ఒక సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో అత్యాధునిక ఆయుదాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, డే విజన్ గ్లాసెస్, ఇతర అత్యాధునిక పరికరాలు ధరించి శత్రువును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారని తెలిపారు. ప్రతి రెండు గంటలకు ఐదు నుంచి ఆరుగురు చొప్పున నిరంతరాయంగా బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. వీరు శ్రీవారి ఆలయ ముఖద్వారాన్ని ప్రధానంగా రక్షిస్తారని తెలిపారు. ఎప్పుడైనా అకస్మాత్తుగా శత్రువులు ఎక్కువమంది దాడి చేసేందుకు ప్రయతి్నస్తే వీరితో పాటు వెంటనే బ్యారెక్‌లోని మరో 20 మంది ఆక్టోపస్ సిబ్బందికి సమాచారం అందుతుందని వారు కాలినడకన ఇక్కడకు చేరుకుని శత్రువును ఎదుర్కొనేలా భద్రతను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. అత్యాధునిక భద్రతా దళం.. ఆక్టోపస్ రాష్ట్రంలో ఉగ్రవాదం, మత కలహాలను అణచివేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ విభాగం ‘ఆపరేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్). దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ 2007, అక్టోబర్ 1న నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యుత్తమ సాయుధ బలగాల తరహాలో ఆక్టోపస్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ నుంచి మెరికల్లాంటి వారిని ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా ఎన్ఎస్జీ కమాండోల తరహాలో శిక్షణనిస్తారు. గ్లోక్–19 పిస్టల్స్, కోల్ట్ 9ఎంఎం ఎస్ఎంజీ, ఫ్రాంచి స్పాస్–15 డ్యూయల్ మోడ్ షాట్‌గన్స్, స్నైపర్ రైఫిల్స్, టేజర్ గన్స్, కార్నర్ షాట్స్ సిస్టం మొదలైన అత్యాధునిక ఆయుధాలతో విజయవంతంగా దాడులు చేయడంలో వీరు నిష్ణాతులు. ఉగ్రవాదులు ఎలాంటి దుశ్చర్యలకు యతి్నంచినా మెరుపువేగంతో తిప్పికొట్టగల సామర్థ్యం ఆక్టోపస్ సొంతం. -
తప్పుడు ఆరోపణలు చేయొద్దని మళ్లీ చెబుతున్నాం: డీజీపీ
సాక్షి, అమరావతి: కౌంటర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 7వ జాతీయ స్థాయి ఈవెంట్లో ఏపీ అక్టోపస్ బలగాలు మొదటి స్థానం సాధించాయి. ఏపీ పోలీసులకు, ప్రజలకు ఇది గర్వించదగ్గ రోజు అని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మన గ్రేహౌండ్స్ బలగాలు మంచి ప్రదర్శన చేస్తున్నాయి. అంతర్జాతీయస్థాయిలో కూడా ప్రతిభ కనిబరిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా అక్టోపస్ బలగాలను రీ లొకేట్ చేయాలని సూచించారు. ఇకపై జిల్లా కేంద్రాల్లో సైతం అక్టోపస్ బలగాలు సేవలు అందిచనున్నాయి. గ్రేహౌండ్స్, అక్టోపస్ బలగాలను ఇచ్చేందుకు కేంద్రం సహకరిస్తుంది. నైట్ ఫైరింగ్ విషయంలో ఏపీ అక్టోపస్ అత్యుత్తమ శిక్షణ ఇస్తోంది. రాష్ట్రంలో వివిధ ర్యాంకుల్లో మొత్తం 500 మంది అక్టోపస్ ఆఫీసర్లు ఉన్నారు. నైట్ ఫైరింగ్ విషయంలో ఏపీ అక్టోపస్ అత్యుత్తమ శిక్షణ ఇస్తోంది' అని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. చదవండి: (దుష్ప్రచారమే టీడీపీ అజెండా) తప్పుడు ఆరోపణలు చేయొద్దు: డీజీపీ ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్‌తో ఏపీకి సంబంధం లేదు. ఈ విషయం చాలాసార్లు స్పష్టంగా చెప్పినా నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. మేం కూడా ఆ సంస్థలతో టచ్‌లో ఉన్నాం. కొన్ని రాజకీయ పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ తరహా విమర్శల వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్నారు. రాష్ట్రం పరువు పోయేలా కొన్ని పార్టీలు హెరాయిన్ విషయంలో ఆరోపణలు చేయడం సరికాదు. ప్రజల్లో, యువతలో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. కొందరు అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు కాబట్టే నోటీసులు జారీ చేస్తున్నాం. తప్పుడు ఆరోపణలు చేయొద్దని మళ్లీ చెబుతున్నాం. ఎన్ఐఏ వాళ్లే కాకుండా ఇంకొన్ని దర్యాప్తు సంస్థలు వచ్చి ఉంటాయి. ఏపీకి వచ్చి విచారణ చేసుకుంటే తప్పేంటీ..? అని ప్రశ్నించారు. చదవండి: (AP: బడితోనే అమ్మఒడి) -
సీఎం వైఎస్ జగన్ భద్రతకు ఆక్టోపస్ టీమ్
సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆక్టోపస్ దళంలోని ప్రత్యేక కమాండోలను సీఎం భద్రతకు కేటాయించారు. కౌంటర్ టెర్రరిజంలో ప్రత్యేక శిక్షణ కలిగిన ఈ బలగాలు సీఎం నివాసం వద్ద బుధవారం నుంచి విధులు చేపట్టాయి. ప్రస్తుతం ఉన్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ)తోపాటు ఆక్టోపస్ టీమ్ కూడా పనిచేస్తుంది. 30 మంది ఆక్టోపస్ సభ్యులు గల ఈ టీమ్ ప్రత్యేక బృందాలుగా విడిపోయి పనిచేస్తుంది. ఆరుగురు సభ్యుల చొప్పున ఐదు బృందాలుగా ఏర్పడి ఆక్టోపస్ టీమ్ నిర్ధేశించిన విధులు చేపడుతుంది. సీఎం వెంట ఉండటంతోపాటు ఆయన పర్యటనలు, సభలు, సమావేశాల సందర్భంలో ఆక్టోపస్ టీమ్‌లు షిఫ్ట్‌ల వారీగా పనిచేస్తాయి. -
ఆక్టోపస్ ఆపరేషన్‌లో అపశ్రుతి
ఇబ్రహీంపట్నం రూరల్: ఆక్టోపస్ పోలీసుల మాక్‌డ్రిల్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి ఛేదించే క్రమంలో ప్రమాదం జరిగింది. కమాండోలు ప్రయాణిస్తున్న కారు ముందుగా వెళ్తున్న బస్సును ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. బొంగ్లూర్ నుంచి తుక్కుగూడ వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డు బైపాస్ టీసీఎస్ వెనుక మంగళవారం ఉదయం ఆక్టోపస్ కమాండోలు బస్సు, కారుతో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. డ్రిల్‌లో అతివేగంగా వెళ్తున్న బస్సును కారులో ప్రయాణిస్తున్న వారు వెళ్లి పట్టుకునే సన్నివేశాన్ని ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా ముందు కమాండోల బస్సు వెళ్తుంటే వెనుక నుంచి టాటా ఇండికా కమాండోల కారు వెళ్లి వారిని ఆపాలి. అయితే ప్రమాదవశాత్తు వెనుక కారు ముందుగా వెళ్తున్న కమాండోల బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సురేశ్, లక్పతి, రాహుల్ భవానీసింగ్, చెన్నకేశవరెడ్డి, శేఖర్‌లకు గాయాలయ్యాయి. వెంటనే వీరిని బస్సులో నగరంలోని కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. కారు నడిపిన లక్పతి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మిగతా నలుగురికీ స్వల్ప గాయాలయ్యాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఆక్టోపస్ ఐజీలతో పాటు సివిల్ పోలీసు లు ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. -
చర్లపల్లి జైలు వద్ద హై అలర్ట్
హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగారం వద్ద శుక్రవారం రాత్రి హైడ్రామా నెలకొంది. జైలు ఆవరణ చుట్టూ పోలీస్ విభాగమైన ఆక్టోపస్ బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించారు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల నిందితుడు, ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడైన యాసిన్ భత్కల్ జైలు నుంచి పారిపోయే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. కొద్దిరోజుల కిందట జైలు నుంచి తన తల్లి, భార్యతో ఫోన్లో మాట్లాడిన భత్కల్.. జైలు నుంచి బయటికి వస్తానని చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన వార్తలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇటు రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. భత్కల తప్పించుకుంటాడనే వార్తలను జైళ్ల శాఖ అధికారులు మొదట కొట్టిపారేసినప్పటికీ తర్వాత ఆ అవకాశం లేకపోలేదని పేర్కొనడం గమనార్హం.