సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆక్టోపస్ దళంలోని ప్రత్యేక కమాండోలను సీఎం భద్రతకు కేటాయించారు. కౌంటర్ టెర్రరిజంలో ప్రత్యేక శిక్షణ కలిగిన ఈ బలగాలు సీఎం నివాసం వద్ద బుధవారం నుంచి విధులు చేపట్టాయి. ప్రస్తుతం ఉన్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ)తోపాటు ఆక్టోపస్ టీమ్ కూడా పనిచేస్తుంది. 30 మంది ఆక్టోపస్ సభ్యులు గల ఈ టీమ్ ప్రత్యేక బృందాలుగా విడిపోయి పనిచేస్తుంది. ఆరుగురు సభ్యుల చొప్పున ఐదు బృందాలుగా ఏర్పడి ఆక్టోపస్ టీమ్ నిర్ధేశించిన విధులు చేపడుతుంది. సీఎం వెంట ఉండటంతోపాటు ఆయన పర్యటనలు, సభలు, సమావేశాల సందర్భంలో ఆక్టోపస్ టీమ్‌లు షిఫ్ట్‌ల వారీగా పనిచేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment