యాసిన్ భత్కల్‌కు అక్టోబరు 17 వరకు రిమాండ్ | Remand to Yasin Bhatkal to October 17th | Sakshi
Sakshi News home page

యాసిన్ భత్కల్‌కు అక్టోబరు 17 వరకు రిమాండ్

Published Mon, Sep 23 2013 2:12 PM | Last Updated on Fri, Sep 28 2018 4:46 PM

యాసిన్ భత్కల్‌కు  అక్టోబరు 17 వరకు రిమాండ్ - Sakshi

యాసిన్ భత్కల్‌కు అక్టోబరు 17 వరకు రిమాండ్

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ను  హైదరాబాద్‌ పోలీసులు ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.  అక్టోబరు 17 వరకు కోర్టు భత్కల్ను రిమాండ్ విధించింది.    దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లకు ప్రధాన సూత్రధారులైన యాసిన్‌, తబ్రేజ్‌లను  గత నెల 28న  భారత్-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భత్కల్ను హైదరాబాద్‌ అధికారుల కస్టడీకి ఇవ్వడానికి ఢిల్లీ కోర్టు అనుమతించింది. దాంతో హైదరాబాద్‌ ఎన్‌ఐఏ అధికారులు భత్కల్‌ను విచారిస్తున్నారు.

 ఫిబ్రవరి 21న జరిగిన దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు  యాసిన్ భత్కల్ అంగీకరించాడు. గత వారంలో ఎన్‌ఐఏ అధికారులు భత్కల్‌ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గోవా తీసుకెళ్లారు. అక్కడ అంజునా, పనాజి సమీపంలోని చింబెల్ అనే మురికివాడలో అతడు నివసించిన ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కొన్ని యాసిడ్ బాటిళ్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చింబెల్ ఇందిరానగర్ నుంచి విచారణ నిమిత్తం ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అంజునాలో భత్కల్ అద్దెకు ఉన్న నివాసం నుంచి ఎన్‌ఐఏ అధికారులు బాంబు తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు గోవా సీఎం మనోహర్ పారికర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement