In Darbhanga Bomb Blast Case, NIA Claims Accused Terrorists Received Rs 1.6 Lakh From Pakistan - Sakshi
Sakshi News home page

దర్భంగా కేసు: "రా" ఏజెంట్‌ను అంటూ..

Published Sun, Jul 4 2021 11:51 AM | Last Updated on Sun, Jul 4 2021 3:27 PM

Darbhanga Bomb Blast Case Sensational Information - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌ : దర్భంగా బ్లాస్ట్‌కు సంబంధించి మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాలిక్‌ తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటంపై కుటుంబ సభ్యుల ఆరా తీయగా..  తాను ఇండియన్‌ ‘‘రా’’ ఏజెంట్‌ను అంటూ కుటుంబ సభ్యులను నమ్మించాడు. నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ ఖాన్‌​​లు కుటుంబాన్ని మోసం చేసి ఉగ్ర కార్యాచరణ చేపట్టారు. తాను "రా" పనిపై పాక్ వెళ్తున్నట్లు చెప్పి.. పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదుల వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. 2012లో 4 నెలలపాటు పాకిస్తాన్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఐఈడీ అమర్చడంలో నాసిర్‌ మాలిక్ మాస్టర్ మైండ్‌.

సోదరులిద్దరూ 2016లో దుబాయ్ వెళ్లారు. కాగా,  ఢిల్లీ ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌ చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ఈ కేసును దర్యాప్తు చేయనున్నారు.  దర్భంగా బ్లాస్ట్‌ వెనుక భారీ కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్లాస్ట్‌కు ముందు మాలిక్‌ సోదరుల కదలికలపై ఎన్‌ఐఏ విచారణ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement