
‘యోగి.. నువ్వు ఒట్టి చేతులతో రావొద్దు’
- ఉత్తరప్రదేశ్‌లో లిక్కర్ బ్యాన్ అమలుచేయ్
- స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఇవ్వు
- నేడు దర్భాంగలో పర్యంటించనున్న సీఎం యోగికి నితీష్ సలహాలు
దర్భాంగ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒట్టి చేతులతో రావొద్దని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. తన రాష్ట్రంలో మాదిరిగా ఉత్తరప్రదేశ్‌లో కూడా యోగి సంపూర్ణ మద్యం నిషేధాన్ని అమలుచేయాలని సూచించారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పారు. దర్బాంగలో రూ.300కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ నుంచి యోగి నేర్చుకోవాల్సింది, తమను అనుసరించాల్సింది చాలా ఉందని అన్నారు. గురువారం యూపీ సీఎం యోగి దర్భాంగలో పర్యటిస్తున్న నేపథ్యంలో స్పందించిన నితీశ్ తాను ఇప్పటికే పలు అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నందున ఆయనిక ఇక్కడికి ఒట్టి చేతులతో వచ్చి వెళ్లాల్సిందేనని అన్నారు. 2014 ఎన్నికల్లో బిహార్‌కు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో ప్రధాని నరేంద్రమోదీ విఫలమయ్యారని, తాము మాత్రం ఏమేం హామీలు ఇచ్చామో వాటన్నింటిని అమలుచేస్తున్నట్లు తెలిపారు.