
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. ఐఆర్‌సీటీసీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న లాలూకు పటియాల కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ శనివారం తీర్పును వెలువరించింది. రూ.లక్ష వ్యక్తిగత పూచికత్తుతో రెగ్యూలర్ బెయిల్‌కు న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ కేసులో లాలూ సతీమణి రబ్రీ దేవి, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు మధ్యంతర బెయిల్ సమయాన్ని జనవరి 28 వరకు పొడిగించినట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది.
లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖమంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్‌సీటీసీలో భారీగా అవకతవకలు జరిగాయన్న కారణంగా సీబీఐ అతనిపై అభియోగాలు మోపింది. కుంభకోణాన్ని గుర్తిస్తూ 2006లో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో లూలూ కుటుంబానికి భారీ మొత్తంలో ముడుపులు అందినట్టు సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ప్రస్తుతం లాలూ రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment