IRCTC Scam
-
ఐఆర్సీటీసీలో నెలకు రూ.30 - 80 వేలు సంపాదించండిలా !
మీరు ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. ఆన్లైన్ లో నెలకు రూ.80 వేలు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తుంది ఇండియన్ రైల్వే. ఇండియన్ రైల్వేకి చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరోషన్ (irctc) లో ట్రైన్ టికెట్లు బుక్ చేసి మనీ ఎర్న్ చేయవచ్చు. ప్రతి టికెట్ బుకింగ్ పై కమిషన్ రూపంలో ఐఆర్సీటీసీ మనకు అందిస్తుంది. ఇండియన్ రైల్వే డేటా ప్రకారం 55శాతం రైల్వే ప్రయాణికులు టికెట్లను రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు రిజర్వేషన్ చేయించుకునే ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నిరుద్యోగ యువత, అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఈ అవకాశం కల్పించింది. ఐఆర్సీటీసీలో టికెట్లు బుక్ చేస్తే వచ్చే ఆదాయం ఐఆర్సీటీసీ ఏజెంట్‌గా నాన్ ఏసీ ట్రైన్ టికెట్ బుక్ చేసిన ప్రతి సారి రూ.20 కమిషన్ వస్తుంది ఏసీ టికెట్లు బుక్ చేస్తే టికెట్ పై రూ.40 కమిషన్ వస్తుంది అంతేకాదు మనీ రూ.2వేలు ట్రాన్స్‌శాక్షన్ పై 1శాతం కమీషన్ తో పాటు రూ.2వేలు ట్రాన్సాక్షన్ దాటితే గేట్‌వే ఛార్జీలను అదనంగా పొందవచ్చు. నెలలో అపరిమితంగా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఒక్కో టికెట్ పై పక్కా కమిషన్‌ను పొందవచ్చు. దీన్ని బట్టి నెలకు రూ.80వేలు డబ్బులు సంపాదించుకోవచ్చు. అంతకాకపోయినా నెలకు రూ.40 నుంచి రూ.50వేల వరకు రాబడి ఉంటుంది. ఆర్థరైజ్ ఐఆర్సీటీసీ ఏజెంట్‌గా పనిచేయాలంటే ఏంజెంట్‌గా పనిచేయాలనుకుంటే ఐఆర్సీటీసీకి ఏడాది రూ.3,999 అగ్రిమెంట్ చేయించుకోవాలి రెండు సంవత్సరాలకు రూ.6,999 చెల్లించాలి. 100 టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్‌పై రూ.10 చెల్లించాలి 101 నుంచి 300టికెట్లు బుక్ చేస్తే 8రూపాయిలు చెల్లించాలి 300 టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ పై రూ.5 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది ఆర్థరైజ్ ఐఆర్సీటీసీ ఏజెంట్‌గా గుర్తింపు రావాలంటే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి సంబంధిత శాఖ అధికారుల రిక్వైర్ మెంట్‌ను బట్టి అడ్రస్ ప్రూప్‌లను సబ్మిట్ చేయాల్సి ఉంది. సబ్మిట్ చేసిన వెంటనే మన ఐడీ వెరిఫికేషన్ జరిగి ఓటీపీ వస్తుంది. అనంతరం మీరు ఐఆర్సీటీసీ ఐడీతో ఎంటర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ కింద రూ1100 చెల్లించాలి చెల్లించిన తరువాత మీకు ఆర్ధరైజ్ ఐఆర్సీటీసీ ఏజెంట్‌గా అనుమతి లభిస్తోంది. -
ఐఆర్సీటీసీ స్కామ్ : లాలూ దంపతులకు బెయిల్
-
ఐఆర్సీటీసీ స్కామ్ : లాలూ దంపతులకు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ సహా ఇతరులకు ఢిల్లీలోని పటియాల హౌస్ కోర్టు సోమవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ లక్ష వ్యక్తిగత బాండ్ అదే మొత్తం పూచీ కత్తుపై వారికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది. ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో బెయిల్ లభించడం పట్ల తేజస్వి యాదవ్ స్పందిస్తూ ఈ కేసులో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని, న్యాయవ్యవస్ధ పట్ల తమకు విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. ఇదే కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌కు శనివారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో లాలు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. పూరి, రాంచీలో రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణను ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడంలో లాలూ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ లాలూచీ పడ్డారని దర్యాప్తు ఏజెన్సీ ఆరోపిస్తోంది. -
లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. ఐఆర్సీటీసీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న లాలూకు పటియాల కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ శనివారం తీర్పును వెలువరించింది. రూ.లక్ష వ్యక్తిగత పూచికత్తుతో రెగ్యూలర్ బెయిల్‌కు న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ కేసులో లాలూ సతీమణి రబ్రీ దేవి, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు మధ్యంతర బెయిల్ సమయాన్ని జనవరి 28 వరకు పొడిగించినట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖమంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్సీటీసీలో భారీగా అవకతవకలు జరిగాయన్న కారణంగా సీబీఐ అతనిపై అభియోగాలు మోపింది. కుంభకోణాన్ని గుర్తిస్తూ 2006లో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో లూలూ కుటుంబానికి భారీ మొత్తంలో ముడుపులు అందినట్టు సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ప్రస్తుతం లాలూ రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. -
ఆ రెండు కేసుల్లో లాలూకు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు గురువారం ఢిల్లీ కోర్టు వచ్చే ఏడాది జనవరి 19 వరకూ మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. సీబీఐ, ఈడీ దాకలు చేసిన రెండు ఐఆర్సీటీసీ కేసుల్లో లాలూ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు లాలూకు బెయిల్ లభించినా పశుగ్రాస కుంభకోణం కేసులకు సంబంధించి లాలూ రాంచీ జైలులోనే శిక్ష అనుభవించనున్నారు. ఐఆర్సీటీసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ రాంచీ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొన్నారు. ఈ కేసులో ప్రత్యేక న్యాయమూర్తి అరుణ్ భరద్వాజ్ లాలూ ప్రసాద్‌కు బెయిల్ మంజూరు చేశారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ కోరుతూ లాలూ చేసుకున్న దరఖాస్తులపై బదులివ్వాలని సీబీఐ, ఈడీలను కోర్టు ఆదేశించింది. ప్రైవేట్ సంస్థకు రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టును కట్టబెట్టడంలో లాలూ అక్రమాలకు పాల్పడ్డారని ఈ కేసులో ఆయనపై దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. -
ఈ–టికెట్లలో గోల్మాల్!
సాక్షి, సిటీబ్యూరో: కొద్ది రోజుల క్రితం రైల్వే విజిలెన్స్ అధికారులు హబ్సిగూడలోని ఒక ఏజెంట్ ఇంటిపై దాడులు నిర్వహించారు. అందులో పట్టుబడిన రైల్వే టిక్కెట్లు చూసి అధికారులే విస్తుపోయారు. సుమారు రూ.1.5 లక్షల విలువైన టికెట్లను, వాటితో పాటు కంప్యూటర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు ఏజెంట్ బినామీ పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించి పెద్ద ఎత్తున అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఒక్క హబ్సిగూడకు చెందిన ఏజెంట్ మాత్రమే కాదు... నగరంలోని వేలాది మంది రైల్వే టికెట్ ఏజెంట్లు ఇదే తరహా దందా నిర్వహిస్తున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులు, విజిలెన్స్ అధికారులు నిర్వహించే తనిఖీలు ప్రహసనంగా మారుతున్నాయి. అక్రమ దందాను అరికట్టేందుకు ఎలాంటి నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టకపోవడంతో ఏటా కోట్లాది రూపాయాల ప్రయాణికుల సొమ్ము దళారుల జేబుల్లోకి వెళ్తోంది. మరోవైపు ప్రతిఏటా దక్షిణమధ్య రైల్వే నిర్వహించే విజిలెన్స్ వారోత్సవాలు ఒక తంతుగానే మారుతున్నాయి. ఏ టు జడ్ ఐడీలు... దక్షిణమధ్య రైల్వేలో ప్రతిరోజు సుమారు లక్ష టికెట్లను విక్రయిస్తారు. వీటిలో 40వేల టికెట్లు రైల్వే స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్ల నుంచి విక్రయిస్తుండగా... 60వేల టికెట్లు ఐఆర్సీటీసీ వెబ్సైట్ నుంచి విక్రయిస్తున్నారు. ప్రయాణికులు తమ సొంత ఐడీలపైన ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆధార్‌తో పాటు నమోదైన ఐడీపైన 12 టికెట్లు, సాధారణ ఐడీలపైన 6టికెట్ల వరకు బుక్ చేసుకునేందుకు ప్రయాణికులకు వెసులుబాటు ఉంది. అలాగే నామమాత్రపు చార్జీలతో ఏజెంట్ల వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునేందుకు ప్రయాణికులకు ఉదయం 10గంటలకే అనుమతి లభిస్తుండగా, ఏజెంట్లకు మాత్రం అరగంట ఆలస్యంగా ఉదయం 10:30గంటలకు లభిస్తుంది. ఈ క్రమంలోనే ఏజెంట్లు అక్రమాలకు తెరలేపుతున్నారు. ఏజెంట్‌గా నమోదు చేసుకొని ఐఆర్సీటీసీ నుంచి పొందిన గుర్తింపుపై కాకుండా బినామీ పేర్లపైన సాధారణ ప్రయాణికులుగా నమోదు చేసుకున్న ఐడెంటిటీలపై తత్కాల్ టికెట్లను కొల్లగొడుతున్నారు. వాటిని ప్రయాణికులకు రెట్టింపు చార్జీలకు కట్టబెడుతున్నారు. రిజర్వేషన్లలోనూ ఇదే తరహా బినామీ దందా కొనసాగుతోంది. ‘ఇందుకోసం ఏ నుంచి జడ్ వరకు ఉన్న 26 అక్షరాలపై రకరకాల ఐడీలను సృష్టిస్తారు. ఈ ఐడీలపైనే పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేస్తారు. ఒకే కంప్యూటర్ నుంచి ఈ రకమైన బినామీ ఐడీలు వందల కొద్దీ నమోదై ఉంటాయి’ అని దక్షిణమధ్య రైల్వే విజిలెన్స్ అధికారి ఒకరు ‘సాక్షి’తో విస్మయం వ్యక్తం చేశారు. కూకట్పల్లి, సికింద్రాబాద్, బోయిన్పల్లి, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఏజెంట్ల అక్రమ దందా భారీ ఎత్తున కొనసాగుతోందని చెప్పారు. పండగలు, వరుస సెలవుల్లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు టికెట్లను రెట్టింపు చార్జీలకు కట్టబెడుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు స్లీపర్ క్లాస్ టికెట్ చార్జీ రూ.450 వరకు ఉంటే రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఏజెంట్లు రూ.1000 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నట్లు అంచనా. ఇలా ఒక్క హైదరాబాద్‌లోనే ఏటా కోట్లాది రూపాయాల అక్రమ దందా కొనసాగుతోంది. చర్యలు శూన్యం... నకిలీ ఐడీలపై బల్క్‌గా టికెట్లను బుక్ చేస్తూ ప్రయాణికుల నిలువుదోపిడీకి పాల్పడడమే కాకుండా... రైల్వేను సైతం పెద్ద ఎత్తున మోసం చేస్తోన్న ఏజెంట్ల అక్రమాలను అరికట్టేందుకు చేపడుతున్న చర్యలు మొక్కుబడిగానే ఉన్నాయి. ఏటా విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా దాడులు చేసి కేసులు నమోదు చేయడం మినహా ఈ అక్రమ దందాను అరికట్టలేకపోతున్నారు. ప్రతి రోజు వెబ్సైట్ నుంచి బుక్ అయ్యే టికెట్లు ఏ సిస్టమ్ నుంచి బుక్ అవుతున్నాయనేది నమోదవుతుంది. సాధారణ ప్రయాణికులైతే ఏ నెలకో, ఆరు నెలలకో ఒకసారి తమ అవసరాల మేరకు టికెట్లను బుక్ చేసుకుంటారు. ప్రయాణకులు ఏ కంఫ్యూటర్ నుంచి ఎన్ని టికెట్లు బుక్ చేసుకున్నదీ తెలిసిపోతుంది. అదే విధంగా ఏజెంట్లు ఒకే కంప్యూటర్ నుంచి ప్రతిరోజు రకరకాల ఐడీలపైన టికెట్లు బుక్ చేస్తున్నప్పుడు కచ్చితంగా గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. రైల్వే యాక్ట్‌లోని సెక్షన్ 143 ప్రకారం రూ.10వేల వరకు జరిమానా విధిస్తారు. ఏడాది పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. కానీ ఆర్పీఎఫ్, విజిలెన్స్ అధికారులు నిర్వహించే మొక్కుబడి దాడుల కారణంగా ఏజెంట్ల అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. -
తేజస్వీ, రబ్రీ దేవీలకు బెయిల్
న్యూఢిల్లీ : ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) కుంభకోణం కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఊరట లభించింది. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు శనివారం రబ్రీదేవి, తేజశ్వి యాదవ్‌లకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టుకు హాజరైన నిందితులందరికీ పాటియాలా కోర్టు మధ్యంతర బెయిలిచ్చింది. నిందితులందరికీ ఒక్కొక్కరికి లక్ష రూపాయల వ్యక్తిగత పూచికత్తు మీద బెయిల్ మంజూరు చేసింది. అంతేకాక ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున ఇవాళ కోర్టు విచారణకు హాజరుకాలేదు. లాలూ ప్రస్తుతం రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన ప్రయాణాలు చేయడానికి వీల్లేదని వైద్యులు స్పష్టం చేశారు. అందువల్ల లాలూను కోర్టులో హాజరుపరచలేమని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. అందుకు సమ్మతించిన కోర్టు, నవంబర్ 19న జరిగే విచారణకు లాలూ తప్పకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్సీటీసీ కుంభకోణంపై గతేడాది జూలై 5న సీబీఐ, ఈడీ కేసు నమోదు చేసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రాంచి, పూరీలోని ఐఆర్సీటీసీ హోటళ్లను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
రబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌లకు బెయిల్ మంజూరు
-
రబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌లకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఐఆర్సీటీసీ భూ కుంభకోణం కేసులో బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కుమారుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌లకు ఢిల్లీ పటియాలా కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. నిందితులు లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్‌కు సీబీఐ కోర్టు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. పశుగ్రాస కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన క్రమంలో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ నేడు కోర్టు ఎదుట హాజరు కాలేకపోయారు. ఐఆర్సీటీసీ స్కామ్‌లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్ సహా 13 మంది ఇతరులపై ఈడీ తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. చార్జిషీట్లో ఆర్జేడీ నేత , కేంద్ర మంత్రి ప్రేమ్ చంద్ గుప్తా, ఆయన భార్య సరళా గుప్తా, సంస్థ లారా ప్రాజెక్ట్స్ పేర్లనూ ప్రస్తావించింది. పూరి, రాంచీల్లో రెండు రైల్వే హోటళ్లను నిబంధనలకు విరుద్ధంగా తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ మాజీ సీఎం లాలూ, ఐఆర్సీటీసీ అధికారులు విజయ్, వినయ్ కొచ్చర్లకు చెందిన సుజాత హోటల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కట్టబెట్టారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు ప్రతిగా లాలూ సన్నిహితుడైన పీసీ గుప్తాకు చెందిన డిలైట్ మార్కెటింగ్ కంపెనీకి మార్కెట్ ధర కన్నా తక్కువ ధరలో విలువైన భూమిని బదలాయించారని పేర్కొన్నాయి. వీటిలో వాటాలు దక్కించుకోవడం ద్వారా అతితక్కువ ధరకే విలువైన భూమిని రబ్రీదేవి, ఆమె కుమారుడు తేజస్వి యాదవ్‌లు సొంతం చేసుకున్నారని దర్యాప్తు సంస్ధలు ఆరోపిస్తున్నాయి. -
IRCTC కుంభకోణంలో లాలూకు షాక్