న్యూఢిల్లీ : గరీబ్‌రథ్ రైల్వే సేవలు రద్దవుతున్నాయంటూ మీడియాలో వస్తున్న కథనాలను రైల్వే శాఖ కొట్టిపారేసింది. ఇప్పటికే ఖతోగడాం-జమ్ము, ఖతోగడాం- కాన్‌పూర్ గరీబ్‌రత్ సేవలకు బదులుగా ఎక్స్‌ప్రెస్ ట్రేన్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే గరీబ్ రథ్‌లను 3 టైర్ ఏసీలుగా మారుస్తున్నారంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని రైల్వే అధికారుల స్పష్టం చేశారు. కానీ భవిష్యత్తులో ఈ విషయమై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇక కొత్త కోచ్‌ల తయారీ పట్ల కేంద్ర ప్రభుత్వం విముఖంగా ఉందని, పదేళ్ల పైబడిన రైళ్ల వల్ల నాణ్యతను పెంచడానికి విపరీతంగా ఖర్చవుతున్నట్లు రైల్వే అధికారుల చెబుతున్నారు.
కాగా గతంలో లాలు ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో పేద ,మద్య తరగతి ప్రజల కోసం గరీబ్ రథ్‌ను ప్రారంభించినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇక మొదటి గరీబ్ రథ్ బీహార్ నుంచి పంజాబ్ వరకు సేవలు అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుత దేశవ్యాప్తంగా 26 గరీబ్‌రథ్ రైళ్లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. కాగా తొలినాళ్లలో ఈ ఢిల్లీ- బాంద్రా రైలు టికెట్ ధర 1050 రూపాయలు ఉండగా ప్రస్తుతం 1500గా ఉంది. ఈ క్రమంలో గరీబ్ రథ్ సేవలు రద్దు చేసినట్లయితే ప్రయాణం భారమవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment