garibradh train
-
గరీబ్‌రథ్ రైళ్లను ఆపే ప్రసక్తే లేదు..!
న్యూఢిల్లీ : గరీబ్‌రథ్ రైల్వే సేవలు రద్దవుతున్నాయంటూ మీడియాలో వస్తున్న కథనాలను రైల్వే శాఖ కొట్టిపారేసింది. ఇప్పటికే ఖతోగడాం-జమ్ము, ఖతోగడాం- కాన్పూర్ గరీబ్రత్ సేవలకు బదులుగా ఎక్స్‌ప్రెస్ ట్రేన్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే గరీబ్ రథ్‌లను 3 టైర్ ఏసీలుగా మారుస్తున్నారంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని రైల్వే అధికారుల స్పష్టం చేశారు. కానీ భవిష్యత్తులో ఈ విషయమై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇక కొత్త కోచ్‌ల తయారీ పట్ల కేంద్ర ప్రభుత్వం విముఖంగా ఉందని, పదేళ్ల పైబడిన రైళ్ల వల్ల నాణ్యతను పెంచడానికి విపరీతంగా ఖర్చవుతున్నట్లు రైల్వే అధికారుల చెబుతున్నారు. కాగా గతంలో లాలు ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో పేద ,మద్య తరగతి ప్రజల కోసం గరీబ్ రథ్‌ను ప్రారంభించినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇక మొదటి గరీబ్ రథ్ బీహార్ నుంచి పంజాబ్ వరకు సేవలు అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుత దేశవ్యాప్తంగా 26 గరీబ్‌రథ్ రైళ్లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. కాగా తొలినాళ్లలో ఈ ఢిల్లీ- బాంద్రా రైలు టికెట్ ధర 1050 రూపాయలు ఉండగా ప్రస్తుతం 1500గా ఉంది. ఈ క్రమంలో గరీబ్ రథ్ సేవలు రద్దు చేసినట్లయితే ప్రయాణం భారమవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పూరి- బెంగళూరు గరీబ్ రథ్‌కు తప్పిన ముప్పు
- కుంగిపోయిన రైల్వే ట్రాక్ - ఆరు గంటల పాటు రైళ్ల - రాకపోకలు నిలిపివేత నంద్యాల/ పాయకరావుపేట: పూరి-బెంగళూరు గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెనుముప్పు తప్పింది. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని బొమ్మలసత్రం వద్ద శనివారం రైలు వెళ్లిన వెంటనే ట్రాక్ దిగువనున్న మట్టి జారిపోరుుంది. రైలు వెళ్తున్న సమయంలోనే మట్టి జారిపోరుు ఉంటే పెను ప్రమాదం జరిగేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బొమ్మల సత్రం సమీపంలో కుందూ నది వద్ద రైల్వే వంతెన, కేబుల్ వైర్ల ఏర్పాటు పనులు చేపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం గరీబ్ రథ్ వెళ్లిన కొద్ది క్షణాలకే ఆ కదలికలకు ట్రాక్ దిగువన 20 అడుగుల వెడల్పులో మట్టి జారిపోరుుంది. వంతెన పనులు చేపడుతోన్న ఇంజనీరింగ్ సిబ్బంది నంద్యాల రైల్వే స్టేషన్‌కు సమాచారం అందించగా, రైల్వే సిబ్బంది స్టేషన్లో ఉన్న తిరుపతి-గుంటూరు-కాచిగూడ రైలును నిలిపేశారు. మరమ్మతుల అనంతరం శనివారం సాయంత్రం నుంచి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురం ప్రాంతంలో శనివారం రైల్వే ట్రాక్ పట్టా విరిగిపోవడాన్ని కీమెన్ గుర్తించడంతో అమరావతి ఎక్ప్‌ప్రెస్‌కు ముప్పు తప్పింది. దీంతో ఈ ట్రాక్ మీదుగా వాస్కోడిగామా- హౌరా వెళ్తోన్న అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను 40 నిమిషాల పాటు అధికారులు నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్లింది. -
గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం
-
గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం
- కుంగిన రైల్వే ట్రాక్ - అధికారులు గుర్తించి రైళ్ల రాకపోకల నిలిపివేత - సాయంత్రం ఆరు గంటలకు లైన్ క్లియర్ నంద్యాల: నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నంద్యాల - డోన్ రైల్వే మార్గంలో ట్రాక్ కింద మట్టి కుంగిన విషయాన్ని అధికారులు గుర్తించి అప్రమత్తమయ్యారు. కొద్ది నిమిషాల ముందు ఓ ఎక్స్‌ప్రెస్ రైలు అదే ట్రాక్‌పై క్షేమంగా వెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నంద్యాల రైల్వే స్టేషన్రెండు కి.మీ సమీపంలో బొమ్మలసత్రం ప్రాంతంలో కొద్ది రోజులుగా కుందూ బ్రిడ్జి వద్ద మరో కొత్త వంతెన నిర్మిస్తున్నారు. అయితే మట్టి పనులు జరిగే ప్రాంతాల్లో ట్రాక్ బలహీనమైంది. దీంతో రెండు రోజుల నుంచి ఆ ప్రాంతంలో రైళ్ల వేగాన్ని 20 కి.మీ.కి తగ్గించారు. శుక్రవారం సాయంత్రం ట్రాక్ కింద మట్టి మరింత కుంగడాన్ని గుర్తించి వేగాన్ని 10కి.మీకి పరిమితం చేశారు. శనివారం పూరీ నుంచి బెంగళూరుకు వెళ్లే గరీబ్ ఎక్స్‌ప్రెస్ నంద్యాల స్టేషన్‌కు ఉదయం11.30 గంలకు చేరాల్సి ఉంది. అయితే రైల్వే స్టేషన్‌కు 12కి.మీ దూరంలోని నందిపల్లె వద్ద ఏసీ కోచ్ మెకానిక్ ప్రమాదవశాత్తూ రైలులో నుంచి కింద పడి మృతి చెందాడు. దీంతో రైలు అరగంట ఆలస్యంగా, మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్‌కు చేరింది. తర్వాత 12.05 గంటలకు రైలు బయల్దేరి, బలహీనంగా ఉన్న ట్రాక్‌పై 10కి.మీ వేగంతో వెళ్లింది. రైలు వెళ్లిన కుదుపులకు ట్రాక్ దిగువనున్న మట్టి పూర్తిగా తొలగి పోయింది. వెంటనే అధికారులు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. సాయంత్రం 6 గంటలకు ట్రాక్ మరమ్మతు పనులు పూర్తి కావడంతో రాత్రి నుంచి రైళ్ల రాకపోకలు యథావిధిగా నడుస్తున్నాయి. ప్రయాణికుల ఆందోళన గుంటూరు నుంచి కాచిగూడ వెళ్లే ప్యాసింజర్ శనివారం మధ్యాహ్నం నంద్యాల స్టేషన్‌కు చేరుకుంది. ట్రాక్ మరమ్మతులతో స్టేషన్లో ఉండిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకుని తమ టికెట్ల డబ్బు ఇవ్వాలని వాగ్వాదానికి దిగగా అధికారులు సర్ది చెప్పారు. విజయవాడ - హుబ్లి ప్యాసింజర్ రైలు 4.20గంటలకు రైల్వే స్టేషన్‌ను చేరింది. ఈ రైలు ఆలస్యంగా 6.10 గంటలకు బయల్దేరింది. మద్దరు నుంచి వెనుదిరిగిన కడప ప్యాసింజర్ కడప - నంద్యాల ప్యాసింజర్ రైలు మధ్యాహ్నం 2.15 గంటలకు నంద్యాలకు 10 కి.మీ దూరంలోని మద్దూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ట్రాక్ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో నంద్యాలకు రాకుండానే అక్కడి నుంచి వెనుదిరిగింది. నంద్యాల నుంచి రైలు రద్దు కావడంతో ప్రయాణికుల టికెట్లను వాపస్ చేశారు.