పాట్నా : పెళ్లై కనీసం ఆరు నెలలు కూడా పూర్తి కాకమునుపే విడాకులు కావాలంటూ రచ్చ కెక్కారు బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్. ఈ క్రమంలో విడాకుల విషయం గురించి తండ్రి లాలూకి కూడా సమాచారం అందించారు. అనంతరం హరిద్వార్ వెళ్లిన తేజ్ ప్రతాప్ విడాకుల విషయంలో కుటుంబ సభ్యులు తనకు మద్దతుగా నిలబడితేనే ఇంటికి వస్తాను లేదంటే ఇలానే దేశ సంచారం చేస్తుంటానంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈ క్రమంలో సోదరుడు తేజస్వీ యాదవ్ పుట్టిన రోజు వేడకలకు కూడా హాజరు కాలేదు.
ఫోన్‌లో ఒక లోకల్ మీడియాతో మాట్లాడుతూ.. నా సోదరునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సారి తనే ముఖ్యమంత్రి అవుతాడు. నేను తన పక్కనే ఉంటూ తోడుగా నిలుస్తాను అని చెప్పుకొచ్చారు. మహాభారతంలో అర్జునుడికి, కృష్ణుడు ఎలానో.. నేను నా సోదరునితో అలానే ఉంటానని తెలిపారు. ఈ ఏడాది మే 12 న తేజ్ ప్రతాప్ యాదవ్‌కు, బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలు ఐశ్వర్యరాయ్‌కు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పైళ్లైన నాటి నుంచి తాను ఒక్క రోజు కూడా సంతోషంగా లేనని.. అసలు పెళ్లి చేసుకోవడమే తనకు ఇష్టం లేదని వాపోయారు తేజ్ ప్రతాప్. తానేమో చాలా సింపుల్‌గా ఉంటానని.. ఐశ్వర్య మెట్రో నగరాలలో పెరిగిన యువతి కావడంతో ఆమెకు, తనకు సెట్ అవ్వడంలేదని తెలిపారు తేజ్ ప్రతాప్.
Comments
Please login to add a commentAdd a comment